ఫిబ్రవరి 21 వ తేదీ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 21 & 22,2023 వ తారీఖులలో ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగం మరియు సమైక్య భారతి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం-తెలుగు ప్రాశస్త్యంఅనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు తెలియజేసారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ తెలుగు విభాగం సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ సదస్సు కార్యక్రమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.అనంతరం మీడయా తో మాట్లాడుతూ అంతర్జాతీయ స్ధాయిలో తెలుగు భాషా వైభవం నలుదిక్కుల విస్తరించి నేడు భారతదేశంలో భాషా ప్రయుక్తంగా 16 కోట్లమంది వ్యవహార్తలతో ప్రధమ స్ధానంలో నిలిచిందని జాతీయ అధికారభాష కాగల శక్తి మన తెలుగు భాషకుందని 15 వ శతాబ్ధంలోనే శ్రీ కృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అనటంలో అదే అర్ధం ఇమిడిఉందని అటువంటి మాతృభాషా ప్రాశస్త్రాన్ని భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసారు.ఈ సదస్సులకు దేశవిదేశాలనుండి ప్రముఖ వక్తలు హాజరవుతున్నారని ముఖ్యంగా ప్యారిస్ నుండి ఆచార్య డేనియల్ నేజర్స్ ,శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు ఆచార్య శలాక రఘునాధశర్మ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య పి వరప్రసాదమూర్తి,ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి , ఆచార్య కప్పగంతుల శ్రీనివాస్ వంటి పండితులు హాజరవుతున్నారని ప్రారంభ సమావేశానికిముఖ్యఅతిథిగా ఆంధ్రవిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి, అతిథిగా ఆంధ్రవిశ్వవిద్యాలయ ఆర్ట్స్ & కామర్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య ఎ నరసింహారావు,ముగింపు సమావేశానికి ఆంధ్రవిశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య కె సమత,రిజిస్ట్రార్ ఇన్ ఛార్జి ఆచార్య యన్ కిషోర్ బాబు ముఖ్య,గౌరవ అతిథులుగా హాజరవుతారని రెండు సభా మందిరాలలో 12 సమావేశాలు నిర్వహిస్తున్నామని 68 మంది ప్రతినిధులు వివిధ సమావేశాలలో వక్తలుగా హాజరవుతారని,తెలుగు భాషా పరిశోధన,తెలుగు భాష-అంతర్జాల వినియోగం,తెలుగు ప్రసార మాధ్యమాలు-భాషా విశేషాలు,ప్రాచీన సాహిత్య-భాషా విశేషాలు,పోడుపుకధలు-సామెతలు,పుస్తకప్రచురణ-నిత్యజీవనంలో తెలుగు,తెలుగు జానపద/గిరిజన/బాల సాహిత్యాంశాలు,ఆధునిక భాషా సాహిత్యాంశాలు,విదేశాలలో తెలుగు భాషాబోధన-సంస్కృతుల వ్యాప్తి,తెలుగు భాషా పరిరక్షణ-ఉద్యమస్ఫూర్తి,తెలుగు భాషా బోధన-శాస్త్రీయ దృక్ఫధం,శాస్త్రీయ సంగీతం/గేయ సాహిత్యం/పద్యపఠనం/గజల్స్ వంటి అంశాలపై విస్తృతమైన చర్చ,సమావేశాలు జరుగుతాయని వివరించారు. మూడవ సభా మందిరంలో iBAM అనే అమెరికాకు చెందిన సంస్ధ వారి ఆధ్వర్యంలో జరిగే భాగవత ఆణిముత్యాలు అనే అంశంలో పద్యపఠన,భావార్ధ వివరణ అంతర్జాతీయ బృందంచే భాగవతం గురించి పోతనామాత్యుని గురించి చర్చలుంటాయని ఈ కార్యక్రమంలో మెరుగుమిల్లి వేంకటేశ్వర్లు బృందంచే భాగవత సంకీర్తన జరుగుతుందని భాగవత ప్రసంగాలలో సీనీ నటులు తనికెళ్ళ భరణి,డా అద్దంకి శ్రీనివాస్ ప్రసంగాలు ఉంటాయని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు ఆచార్య వెలమల సిమ్మన్న,ఆచార్య జి యోహాన్ బాబు,సదస్సు సమన్వయకర్తలు డా బూసి వెంకటస్వామి,డా మూర్తి రేమెళ్ళ,సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పికన్నయ్య తదితరులు హాజరయ్యారు ఆచార్య జర్రా అప్పారావు శాఖాధిపతి తెలుగు విభాగం
ఆంధ్రవిశ్వకళాపరిషత్
విశాఖపట్నం